Big Screen Rejection : పెద్ద తెర నిరాకరణ – చిన్న తెర ఆదరణ

Big Screen Rejection : జనవరి 7- ఏప్రెల్ 8 మధ్య మూడు మాసాల్లో ఫ్లాపైన తెలుగు సినిమాల్లో ‘అతిధి దేవో భవ’,’రౌడీ బాయ్స్’,’హీరో’,’గుడ్ లక్ సఖీ’,’సెబాస్టియన్ – పిసి 524′,’ఆడవాళ్ళూ మీకు జోహార్లు’,’స్టాండప్ రాహుల్’,’మిషాన్ ఇంపాసిబుల్’,’గని’ ప్రముఖమైనవి. ఇవి భారీ నష్టాల్ని మిగిల్చాయి.’రాధేశ్యామ్’ ని పక్కన బెడదాం.

వీటిలో రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’, తాప్సీ పన్నూ నటించిన ‘మిషాన్ ఇంపాసిబుల్’,వరుణ్ తేజ్ నటించిన ‘గని’- ఈ చివరి మూడిటి కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే,’స్టాండప్ రాహుల్’ఓవర్సీస్ కలుపుకుని దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే 62 లక్షలే! దీని బిజినెస్ కోటీ 87 లక్షలు.బయ్యర్లకి తేలిన నష్టం కోటీ 25 లక్షలు.

బడ్జెట్ మూడున్నర కోట్లు. నిర్మాత నష్టాన్ని ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

ఏరియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే, నైజాం 18 లక్షలు,సీడెడ్ 9 లక్షలు,ఉత్తరాంధ్ర 10 లక్షలు, ఈస్ట్ – వెస్ట్ 10 లక్షలు,గుంటూరు – కృష్ణా 9 లక్షలు, నెల్లూరు 3 లక్షలు, ఓవర్సీస్ 5 లక్షలు. మొత్తం 62 లక్షలు.

‘మిషాన్ ఇంపాసిబుల్’ క్లోజింగ్ కలెక్షన్స్ 95 లక్షలు! దీని బిజినెస్ రెండు కోట్ల 22 లక్షలు.బయ్యర్లకి నష్టం కోటీ 27 లక్షలు. బడ్జెట్ సుమారు ఆరు కోట్లు.నిర్మాత నష్టాన్ని ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

ఏరియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే,నైజాం 29 లక్షలు,సీడెడ్ 16 లక్షలు,ఉత్తరాంధ్ర 21 లక్షలు,ఈస్ట్ – వెస్ట్ 7 లక్షలు,కృష్ణా – గుంటూరు 9 లక్షలు, నెల్లూరు 6 లక్షలు, ఇతర భాషలు, ఓవర్సీస్ కలుపుకుని 7 లక్షలు.మొత్తం 95 లక్షలు.

ఇక ‘గని’ నిన్న ఆదివారం కలుపుకుని తొలి మూడు రోజులు 4 కోట్ల 18 లక్షలు వసూలు చేసింది. బిజినెస్ 25.30 కోట్లు,బడ్జెట్ 35 కోట్లు. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా 21.82 వసూలు చేయాలి.నిన్న ఆదివారం మరీ పడిపోయిన వసూళ్ళు (69 లక్షలు) చూస్తే అసాధ్యమని తెలుస్తోంది.

రేపు 13, 14 తేదీల్లో విడుదలయ్యే ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ 2’ ల ముందు ‘గని’ ఏం తట్టుకుని నిలబడుతుంది.నిర్మాత నష్టాల్ని ఓటీటీ, శాటిలైట్లే తీర్చాలి.

తొలి మూడు రోజుల వసూళ్ళు చూద్దాం.నైజాం కోటీ 38 లక్షలు,సీడెడ్ 43 లక్షలు, ఉత్తరాంధ్ర 58 లక్షలు, ఈస్ట్ – వెస్ట్ 52 లక్షలు, గుంటూరు – కృష్ణా 54 లక్షలు, నెల్లూరు 18 లక్షలు, కర్ణాటక 24 లక్షలు, ఓవర్సీస్ 31 లక్షలు. మొత్తం నాల్గు కోట్ల 18 లక్షలు.

ఇలా ఫ్లాపవుతున్న సినిమాలన్నిటి విషయంలో కామన్ గా కన్పించే దొకటే- ప్రేక్షకులు తగిన డబ్బులివ్వక పోవడం. గీసి గీసి లక్షా రెండు లక్షలే సమర్పించుకుని వదిలేస్తున్నారు.
ఇక నిర్మాతలకి ఓటీటీ, శాటిలైట్లే ఆశాకిరణా లన్నట్టు అటు వైపు నెట్టేస్తున్నారు ప్రేక్షకులు.వీటి ద్వారా నష్టాలు తీర్చుకుని బయటపడుతున్నారు నిర్మాతలు.థియేటర్లో ప్రేక్షకుల కోసం తీసే సినిమాలకి ప్రేక్షకులు డబ్బివ్వక, నిర్మాతలు ఇతర చోట్ల లాభార్జన చేసుకునే పరిస్థితి వచ్చింది.

ఇలా ఇతర మార్గాల్లో లాభార్జనకి వీలున్నప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడమెందుకు? ఓటీటీల కోసం,శాటిలైట్ల కోసం సినిమాలు తీసి వాటిలో విడుదల చేసుకుంటే సరిపోతుందిగా? థియేటర్లు దేనికి? ప్రేక్షకులు దేనికి? ఇలాటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ ఆత్మ పరిశీలన చేసుకోనంతకాలం థియేటర్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెపెట్టుకుని తీసే సినిమాలు ఫ్లాపావుతూనే వుంటాయి.

***