ఆర్ఆర్ఆర్’ లీకులు.. పక్కా ప్లాన్ ప్రకారమే ?

Big reason behind RRR leakages

Big reason behind RRR leakages

పెద్ద సినిమాల నుండి హీరోల స్టిల్స్, సన్నివేశాల తాలూకు ఫోటోలు బయటకు రావడం కామన్. కొందరు వీటిని చాటుగా తీసి బయటకు వదిలితే ఇంకొందరు కావాలనే సినిమా మీద హైప్ పెంచడానికి రిలీజ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఎడిటింగ్ టేబుల్ మీద నుండి టీజర్లు, ట్రైలర్లు బయటికొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సినిమా బృందాలు పనిగట్టుకుని కొన్నిసార్లు ప్రచారం కోసం వీటిని బయటికి వదులుతుంటారు. కొందరు మాత్రం నిజంగానే లీక్ వీరుల చేతిలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ వీరిలో ఎవరు జెన్యూన్ అనేది కనిపెట్టడం కష్టం.

అయితే నిజంగా లీక్స్ ఉండకూడదు అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తపడతారు. ఒక్కసారి పొరపాటు జరిగితే ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటారు. కానీ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం అలా జరగట్లేదు. తరచూ సినిమా నుండి ఏదో ఒక స్టిల్ బయటికొస్తూనే ఉంది. మొదట్లో రామ్ చరణ్ లుక్ తాలూకు ఫోటోలు బయటకు రాగా టీమ్ కంగారుపడి సెక్యూరిటీ పెంచింది. అయినా లాభం లేదు. ఎన్టీఆర్ స్టిల్స్ లీకయ్యాయి. దీంతో రాజమౌళి బృందం అలర్ట్ అయింది. సెక్యూరిటీని టైట్ చేసింది. కెమెరాలు, ఫోన్లు సెట్లోకి, ఎడిటింగ్ రూంలోకి అలౌ లేదని బోర్డు పెట్టారు. నిఘాకు మనుషుల్ని పెట్టారు.

ఇన్ని చేసినా లాభం లేకపోయింది. తాజాగా ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీమ్ పాత్ర తాలూకు ఫోటోలు ఇబ్బడిముబ్బడిగా బయటికొచ్చేశాయి. బ్రిటిషర్ గెటప్లో చరణ్, పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే షాట్, హీరోయిన్ తాలూకు ఫోటో ఒకటి బయటికొచ్చాయి. ఇంటర్నెట్ మొత్తం ఇవే హల్ చల్ చేస్తున్నాయి. ఆ షాట్స్ చూసి సన్నివేశాల మీద అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. లీకేజ్ వలన సినిమాకు బ్యాడ్ నేమ్ ఏమో కానీ బోలెడంత పబ్లిసిటీ మాత్రం వస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ పబ్లిసిటీ వెనుక తప్పులు కాదు స్వయంకృతం ఉందని, ఎంతటి సినిమాకి అయినా పబ్లిసిటీ అవసరం అని, అందుకు ఏ సినిమా కూడ అతీతం కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.