RRR Movie Already In Theaters Print : ఇండస్ట్రీ టాక్ : ఇప్పుడు థియేటర్స్ లో ఉండగానే “RRR” ప్రింట్ కి బిగ్ ఛేంజెస్.!

RRR Movie Already In Theaters Print : ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు లాంటి మాస్ హీరోలతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ఈ సినిమా. మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లు అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.

ఇప్పటికీ కూడా అన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ కలెక్షన్ అందుకుంటున్న ఈ సినిమాపై మాత్రం ఆడియెన్స్ లో ఒక కంప్లైంట్ బాగా ఉంది. సినిమా మొదటి రోజే చాలా వరకు సినిమాలో డైలాగ్స్ చాలా మందికి అర్ధం కాలేదు. ముఖ్యంగా బ్రిటిషర్లు పై ఉన్న డైలాగ్స్ అయితే చాలానే ఇంగ్లీష్ లోనే వినిపించాయి.

దీనితో తెలుగు ఆడియెన్స్ మాత్రం అంత సౌకర్యంగా ఫీల్ అవ్వలేదు. దీనితో చిత్ర యూనిట్ దృష్టికి వెళ్లిన ఈ అంశంపై మేకర్స్ థియేటర్స్ లో సినిమా ఉండగానే ఆడియో పరంగా పలు మార్పులు చేసి కొత్త ఆడియో ఫైల్ ని పంపారట. అలాగే ఇది చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ మరియు బీసీ సెంటర్ లు ఉండే ప్రదేశాలు వరకు మాత్రమే అట.

సో వారికి అయితే ఈ చిత్రం కొత్త వెర్షన్ అందుబాటులో ఉన్నట్టు అని చెప్పాలి. అలాగే 3డి లో కూడా చాలా చోట్ల సినిమా ఓపెన్ చేశారు. ఇవన్నీ మరి సినిమా వసూళ్లు పెంచే అవకాశాలు ఉన్నవే. కేజీఎఫ్ 2 వచ్చే వరకు అయితే ఈ సినిమా హవా కొనసాగుతుంది అప్పటి వరకు ఈ చిత్రం ఎంత అందుకుంటుందో చూడాలి.