Trivikram :హీరోల వారసులు సినీ పరిశ్రమని రూల్ చేయడం కొత్త విషయమేమీ కాదు. అలాగని, అది తప్పు కూడా కాదు. టాలెంట్ వుంటేనే వారసులైనా ఇంకెవరైనా సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేది. పవన్ నిలదొక్కుకున్నట్లు నాగబాబు నిలదొక్కుకోలేకపోయారు కదా.? ఇలాంటివి చాలానే ఉదాహరణలు కనిపిస్తాయి.
అసలు విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ సినిమాల్లోకి రాబోతున్నాడన్నది పాత వార్తే. పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గతంలోనే ఈ విషయమై చర్చించాడని కూడా వార్తలొచ్చాయి, వస్తూనే వున్నాయి. అయితే, అకిరానందన్ తెరంగేట్రంపై (హీరోగా) ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2022 చివర్లో అకిరానందన్ హీరోగా సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ బాధ్యతలు తీసుకోబోతున్నాడట. అయితే, త్రివిక్రమ్ ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తాడా.? లేదంటే మరో విధంగా సాయపడతాడా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా వుండబోతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అయితే, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తితో వున్నారని అంటున్నారు. రెండు అంతకు మించిన బ్యానర్లు అకిరాని ఇంట్రడ్యూస్ చేయొచ్చని అంటున్నారు.
ప్రస్తుతం అకిరానందన్, సినిమాకి సంబంధించి నటన, డాన్సులు, యాక్షన్ వంటి అంశాలపై శిక్షణ తీసుకుంటున్నాడట. అన్నట్టు, అకిరానందన్ బాగా పాటలు పాడతాడట కూడా.