‘బిచ్చగాడు’ కూడ పాన్ ఇండియా అవతారం ఎత్తాడు

Bichagadu 2 will be pan indian level
Bichagadu 2 will be pan indian level
2016లో తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పిచ్చాయ్ కారన్’ సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి సంచలన విజయం అందుకుంది.  ఈ సినిమాతో  తెలుగులో విజయ్ ఆంటోనీ మంచి మార్కెట్ ను సంపాందించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా విజయ్ ఆంటోనీ సినిమాలంటే ఏదో ఇక కొత్తదనం ఉంటుందనే నమ్మకమైతే తెచ్చుకోగలిగాడు.  
 
ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.  వాటికో ‘బిచ్చగాడు’ సీక్వెల్ కూడ ఉంది.  ప్రస్తుతం అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.  మామూలుగా పెట్టే బడ్జెట్ కంటే 10 నుండి 15 కోట్లు ఎక్కువ పెడుతూ స్టార్ నటీనటులను తీసుకొచ్చి పెద్ద లెవల్లో సినిమాలు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ కూడ అదే బాటలో వెళ్తున్నారు. తన ‘బిచ్చగాడు-2’ కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులను దింపుతున్నారు.  దీంతో చిత్రాన్ని అన్ని ప్రధాన భాషల్లోనూ సేల్ చేయాలనేది విజయ్ ఆంటోనీ లక్ష్యం.  మొత్తానికి తమిళ బిచ్చగాడు ఈసారి పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకోనున్నాడన్నమాట.