పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాణా దగ్గుబాటి ల కాంబోలో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కానీ అదే టైం లో రాజమౌళి సినిమా కూడా రేస్ లో ఉండడం తో సినిమా వాయిదా ఉండొచ్చని ఊహాగానాలు వినిపించాయి.
అలాగే నిన్న ట్రిపుల్ ఆర్ గ్లింప్స్ తో అంతా డిసైడ్ అవ్వొచ్చు అనుకున్నారు. కానీ భీమ్లా నాయక్ మాత్రం అనుకున్న సమయానికే రావడం కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తోంది. అక్కడ RRR ఉన్నా చిత్ర యూనిట్ మాత్రం ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అందుకే ఆ సినిమా ఉన్నా కూడా వెనక్కి తగ్గేది లేదు అంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ థమన్ లు కూడా వర్క్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.