పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తునాడు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికే ఉన్న సంగతి తెలిసిందే.
కానీ తర్వాత చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని తమ కొత్త అప్డేట్స్ లో ఆపేసారు. దీనితో “RRR” రిలీజ్ వల్ల భీమ్లా నాయక్ ఆగిపోయింది అని తెలిసింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏమిటంటే ఈ చిత్రం రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యినట్టు తెలుస్తుంది. ముందు అనుకున్నట్టే జనవరి 12నే ఈ చిత్రం రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.
ముందు కొన్ని డేట్స్ అనుకున్నా మళ్ళీ పాత డేట్ కే ప్రాబ్లెమ్ లేదని చిత్ర యూనిట్ భావించారట. అందుకే జనవరి 12నే సినిమా రిలీజ్ చెయ్యబోతున్నట్టు టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.