Bheemla Nayak: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న భీమ్లా నాయక్ ట్రైలర్!

Bheemla Nayak: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలాగే సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ లాంటి సినిమాలు చేస్తు బిజీగా ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది.

హీరో రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిచగా, ఈ సినిమాను సితార ఎంటర్‌మైంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్రం విడుదల చేశారు.

ఈ సినిమా ట్రైలర్ లో చెప్పిన సమయం కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేయడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ట్రైలర్ ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ట్రైలర్ ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.