పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ మాస్ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పుడు మరింత ఆసక్తి స్టార్ట్ అయ్యింది.
పలు కారణాలు చేత సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది అనుకున్న ఈ చిత్రాన్ని మళ్ళీ అదే జనవరి 12న తీసుకురావచ్చని ఇప్పుడు గట్టి బజ్ వినిపిస్తుండగా, ఇపుడు ఇంకో క్రేజీ ఇన్ఫో వినిపిస్తుంది.
ఆల్రెడీ ఈ సినిమా థియేటర్స్ బ్లాక్ మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాలు వారీగా స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.