Bheemla Nayak : బిగ్ అప్డేట్ : ఆగిపోయిన “భీమ్లా నాయక్” రిలీజ్.!కొత్త డేట్ ఎప్పుడంటే?

Bheemla Nayak : వచ్చే ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భీకర పోటీ వాతావరణమే నెలకొన్న సంగతి తెలిసిందే. మూడు భారీ సినిమాలు టాలీవుడ్ నుంచి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి రెడీగా ఉన్నాయని ఎప్పటికప్పుడు కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రేస్ లో రాజమౌళి భారీ సినిమా ట్రిపుల్ ఆర్ ‘RRR’ అలాగే ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా రాధే శ్యామ్ సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ కి ఉండగా..

వాటికి పోటీగా వెనక్కి తగ్గేదేలే అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ సినిమా “భీమ్లా నాయక్” వచ్చింది. నిజానికి భీమ్లా నాయక్ ముందు నుంచీ ఉంది. కానీ అనూహ్యంగా మిగతా సినిమాలు కూడా డేట్స్ అనౌన్స్ చేస్తే వెనక్కి తగ్గుతారు అనుకున్నారు కానీ పవన్ సినిమా మాత్రం రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని కన్ఫర్మ్ చేశారు. అయినా అనేక కీలక చర్చలు మాత్రం నిర్మాతల యూనిట్ లో ఆగలేదు.

అలా ఈరోజు ఫైనల్ గా భీమ్లా నాయక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. నిర్మాత దిల్ రాజు, రాధే శ్యామ్ నిర్మాత అలాగే ‘RRR’ నిర్మాత దానయ్య లు కలిసి భీమ్లా నాయక్ సినిమా జనవరి నుంచి షిఫ్ట్ అయ్యి ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనితో భీమ్లా నాయక్ వాయిదా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ సందర్భంలోనే నిర్మాతలు పవన్ ని. భీమ్లా నాయక్ నిర్మాతకి మరియు త్రివిక్రమ్ కి ధన్యవాదాలు తెలిపారు.