Bheemla Nayak : ఇప్పుడు తాజాగా టాలీవుడ్ భారీ సినిమాల్లో ఒకటైన మోస్ట్ అవైటెడ్ సినిమా “భీమ్లా నాయక్” సినిమా వాయిదా పడిన విషయం కన్ఫర్మ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు కీలక పాత్రల్లో నటించిన ఈ సాలిడ్ సినిమా అనేక రోజులు సస్పెన్సు అనంతరం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్టు ఈరోజు టాలీవుడ్ నిర్మాతల యూనిట్ తెలిపారు.
దీనితో పవన్ అభిమానులు మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే భీమ్లా నాయక్ సినిమా వాయిదా పట్ల అనేక సార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. మొదటగా తాను చెప్పడమే పవన్ అభిమానులకి క్షమాపణ చెప్పారు.
అంతా నా చెయ్యి దాటిపోయింది అని మా హీరో పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకే భీమ్లా నాయక్ డేట్ ని మార్చేందుకు ఒప్పుకున్నామని, ఆయన ఇండస్ట్రీ మంచి కోసమే డేట్ ని మార్చమని చెప్పారు. అందుకే తప్పలేదు అని తెలిపాడు. కానీ ఈ శివరాత్రి మాత్రం మామూలుగా ఉండదు అని ప్రామిస్ అయితే ఇచ్చారు. దీనితో నాగవంశీ పోస్ట్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.