మాస్ ‘భీమ్లా’..ఆల్ టైం రికార్డ్ సెట్ చేసి పారేశాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడని రికార్డులు లేవు సోషల్ మీడియా నుంచి బాక్స్ ఆఫీస్ వరకు కూడా అన్నిట్లో పవర్ స్టార్ ప్రభంజనం కనిపిస్తుంది. మరి ఇదిలా ఉండగా తాను నటిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” నుండి నిన్ననే మోస్ట్ అవైటెడ్ మాస్ బీట్ ‘లాలా భీమ్లా’ వచ్చింది.

అసలు ఏ సాంగ్ కోసం కూడా ఇంతలా ఎవరూ ఎదురు చూడలేదు అలా చూసారు. దీని కోసం ఎట్టకేలకు ఈ సాంగ్ రావడంతోనే భారీ రెస్పాన్స్ ని అందుకొను దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు ఆల్ టైం సౌత్ ఇండియా రికార్డ్ ని భీమ్లా నాయక్ మడత పెట్టేసి తన జేబులో వేసుకున్నాడు.

ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ఏకంగా 11.3 మిలియన్ వ్యూస్ అందుకొని ముందు రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసింది. దీనితో మాస్ భీమ్లా నాయక్ భారీ రికార్డ్ ని సెట్ చేసిన వాడు అయ్యాడు. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందించారు.