Bheemla Nayak : ఏపీలో “భీమ్లా నాయక్” కి భారీ స్థాయి బిజినెస్.. ఎన్ని కోట్లు రాబట్టాలి అంటే?

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ రానా దగ్గుబాటి హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు మాస్ ఆడియెన్స్ లో నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఇప్పుడు అయితే దాదాపు ఈ నెలలోనే రిలీజ్ కి ప్లాన్స్ వేస్తుండగా ఈ గ్యాప్ లో సినిమాకి బిజినెస్ పనులు స్టార్ట్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా బిజినెస్ ని కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఏకంగా ఏపీలో 40 కోట్లు బిజినెస్ జరిగిందట. ఇది ఒక రీమేక్ సినిమాకి అధికమే అని చెప్పాలి.

సో ఈ మొత్తాన్ని అక్కడ రేట్స్ తో ఈ సినిమా ఎంతమేర గట్టెక్కుతుందో చూడాలి. అలాగే తెలంగాణ లో కూడా ఈ స్థాయిలోనే జరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సాలీడ్ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.