Bheemla Nayak Heroine : ఇన్సైడ్ టాక్ : ధనుష్ సినిమాకి షాకిచ్చిన “భీమ్లా నాయక్” హీరోయిన్..?

Bheemla Nayak Heroine :  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమాల్లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్”. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ ఇద్దరు టాప్ హీరోలకి గాను ఇద్దరు యంగ్ హీరోలని చిత్ర బృందం ఫిక్స్ చేశారు.

మరి వారిలో పవన్ సరసన నిత్యా మీనన్ అలాగే రానా సరసన సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సంయుక్త మీనన్ నే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ అందులోని ఈ భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ చేస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది.

అదే స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్ట మొదటి టాలీవుడ్ సినిమా “సార్” ఇందులో ఈ హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు ఈమె ఈ సినిమా నుంచి పలు కారణాలతో బయటకి వచ్చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరి కారణం ఏమిటి అనేది తెలియరాలేదు కానీ ఈమె అయితే ఈ సినిమా ఇక చెయ్యడని టాక్. మరి దీనిపై అధికారిక కన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఆల్రెడీ జస్ట్ కొన్ని రోజులు కితమే సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది. ఈ గ్యాప్ లోనే ఇలా జరగడం ఆసక్తిగా మారింది.