“భీమ్లా” ప్లాప్ షో..ఫస్ట్ టైం టెలికాస్ట్ లో డిజాస్టర్ టీఆర్పీ వచ్చిందట.!

Bheemla Nayak

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటిల మధ్య వచ్చిన టాలీవుడ్ లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మాస్ ఎంటెర్టైనర్ ఈ చిత్రం రిలీజ్ తోనే అదిరే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లను రాబట్టి పవన్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల షేర్ సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమా ఫస్ట్ టైం స్టార్ మా ఛానెల్లో గత కొన్నాళ్ల కితం టెలికాస్ట్ అయ్యింది. అయితే జెనరల్ గా మన స్టార్ హీరోల సినిమాలు అంటే మినిమమ్ టీఆర్పీ అందుకుంటాయి. కానీ ఈ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యి టెలివిజన్ దగ్గర డిజాస్టర్ అయ్యిందని చెప్పాలి.

ఈ చిత్రం కేవలం 9.1 టీఆర్పీ రేటింగ్ అర్బన్ మరియు రూరల్ లో రాబట్టిందట. అసలు ఇది ఒక డిజాస్టర్ నెంబర్ అని చెప్పాలి. పవన్ కెరీర్లో భారీ ప్లాప్ సర్దార్ గబ్బర్ సింగ్ కే ఆ మధ్య 15 కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది ఈ హిట్ సినిమా 10 కూడా దాటాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారింది.

అయితే ఇంత తక్కువ రావడానికి కారణం ఓటిటి రిలీజ్ కూడా కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాటిలో ఈ సినిమా రికార్డు రెస్పాన్స్ ని అందుకుంది. ఇంకా ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించగా సాగర్ కె చంద్ర దర్శకత్వం అందించాడు.