Bheemla Nayak : బుల్లితెరపై “భీమ్లా నాయక్”..టెలికాస్ట్ ఎప్పుడు అంటే.!

Bheemla Nayak Blast : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఇప్పటి వరకు సినిమాల్లో తనని అప్పుడెప్పుడో బద్రి తదితర సినిమాల తరహా మాస్ అండ్ స్వాగ్ లో చూసిన చిత్రం “భీమ్లా నాయక్”. యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల షేర్ సినిమాగా నిలిచింది. రానా దగ్గుబాటి కూడా మరో హీరో పాత్రలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది విడుదల అయ్యి మాస్ జాతర చూపించింది.
ఓ రకంగా అయితే పవన్ లోని మాస్ విశ్వరూపాన్నే చూపించారు. మరి ఇలా థియేటర్స్ లో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ భారీ హిట్ గా అయ్యి తర్వాత ఓటీటీ లో కూడా వచ్చి అక్కడా హిట్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా మొట్టమొదటి సారిగా తెలుగు బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా టెలికాస్ట్ హక్కుల్ని కొనుగోలు చేసిన స్టార్ మా సంస్థ ఈ అవైటెడ్ సినిమాని వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ హిట్ సినిమాలు అయితే బుల్లితెరపై మంచి టిఆర్పీ లనే నమోదు చేస్తాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించగా మాటలు, స్క్రీన్ ప్లే, చేర్పులు త్రివిక్రమ్ అందించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించి పవన్ కి హిట్ అందించారు.
https://twitter.com/StarMaa/status/1520762254618247168?t=KkLmmcl0gtDk9UdxeGpdVg&s=19