‘భగత్ సింగ్’ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో యాక్షన్ తో పాటు.. ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల మనసులను దోచుకొన్న ఈ చిత్రం తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఓటిటిలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను థియేటర్స్ లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా తిరిగి ఓటీటీలోకి ఎపుడు వస్తుందా? అని వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు డిసెంబర్ 2న తెరపడనుంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు విజయనగరంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ రాజీవ్ తో పాటు, నటీ నటులు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్బంగా …
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ సిఈఓ రాజీవ్ మాట్లాడుతూ.. ”ఇప్పటి వరకు మేము ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ నుండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మేము స్థాపించిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ లో ఇప్పటివరకు మేము 650 సినిమాలు విడుదల చేశాం. థియేటర్స్ ప్రేక్షకులకే కాకుండా.. ఓటిటి ప్రేక్షకులకు కూడా దగ్గర కావాలని ఓటిటిలో విడుదల అవుతున్న మరో మంచి సినిమా ‘భగత్ సింగ్ నగర్’. ముందు ఈ టైటిల్ విని పేట్రియాటిక్ సినిమా అనుకున్నాను. సినిమా చూసిన తరువాత ఇందులో మంచి పేట్రియాటిజమే కాదు.. మంచి లవ్ స్టోరీ, మంచి కమర్సియల్ ఎలిమెంట్స్ తో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఇంతమంచి సినిమాను మా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ నుండి ఓటిటి లో విడుదల చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఇందులో నటించిన నటీ నటులు కొత్తవారైనా సీనియర్ యాక్టర్స్ చాలా చక్కగా నటించారు. దర్శకుడు వాలాజా క్రాంతి ఎంచుకున్న చక్కటి కథాంశాన్ని నమ్మి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు మంచి మంచి సినిమాలు నిర్మించాలని ఆ సినిమాలను మా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ లో విడుదల చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటామని” పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత రమేష్ ఉడత్తు మాట్లాడుతూ.. ”ఒక NRIగా దేశం మీద, రాష్ట్రం మీద మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. బిజినెస్ పరంగా కావొచ్చు.. సామజిక అంశాల మీద కావొచ్చు. అయితే నాకు ‘భగత్ సింగ్ నగర్’ కథ బాగా నచ్చింది. మంచి ఆశయాలతో మంచి సిద్ధాంతాలతో సినిమాకు ఉండాల్సిన అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉండడంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రకాష్ రాజ్, నాజర్ లాంటి ప్రముఖ నటులు మా సినిమా చూసి మెచ్చుకోవడమే కాకుండా, మా సినిమా విజయం సాధించాలని ప్రోత్సహించిన పెద్దలకు ధన్యవాదములు. మంచి సినిమాకు వారంతా సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 2న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది. డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో కూడా స్ట్రీమ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు తెలుగువాడు చూడవలసిన సినిమా. ప్రస్తుత సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం అనేది చాలా అవసరం అంటూ ఒక అందమైన ప్రేమకథలో ప్రేక్షకులకు ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాను ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ రాజీవ్ గారికి కూడా థాంక్స్ చెపుతున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని అన్నారు.
చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ ..”కొత్త నటీ, నటులు, సీనియర్ నటీనటులు, అవార్డు విన్నింగ్ టెక్నిషియన్స్ తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది ఈ చిత్రం. ‘భగత్ సింగ్’ గారు రాసిన ఒక లైన్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో సహజత్వానికి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తీర్చి దిద్దడం జరిగింది. ‘భగత్ సింగ్ నగర్’ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సినిమాను చూసిన క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు. చక్కటి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో బాగా నిర్మించారని 3.5 రేటింగ్ తో రివ్యూస్ కూడా వచ్చాయి. అలాగే ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభించడమే కాకుండా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యింది. మా అందరికీ ఎంతో పేరు తీసుకు వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది. అలాగే డిసెంబర్ 5న ఆమెజాన్ యు.యస్ తో పాటు, యు.కెలలో స్ట్రీమ్ అవ్వనుంది” అని తెలిపారు.
చిత్ర హీరో విధార్థ్ మాట్లాడుతూ.. ”నా మొదటి సినిమాకే ఇంత మంచి పేరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అనవసరమైన క్యారెక్టర్స్ లేకుండా.. దర్శక, నిర్మాతలు సినిమాను ఎంతో చక్కగా తీశారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమాను థియే టర్స్ లలో చూసి మెచ్చుకొన్న వారే కాకుండా.. ఇప్పుడు ఓటిటిలో చూసే ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ ధ్రువిక మాట్లాడుతూ.. ”నేను మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ.. తెలుగులో నాకిది మొదటి సినిమా. నా తొలి సినిమాకే 100% ఛాలెంజింగ్ రోల్ లో నటించి నా పెర్ఫార్మన్స్ నిరూపించుకొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నటించిన వారందరూ కూడా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.