కిసాన్ క్రెడిట్ కార్డుతో 7 శాతం నుండే రైతులకు రుణాలు.. వివరాలు ఇవే!

దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు. రైతుల రెండు చేతులు భూమిలోకి వెళితేనే వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి. ఇలాంటి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చాయి. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల రైతులని ఆదుకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా తక్కువ వడ్డీకే రైతులకు రుణాలను మంజూరు చేస్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతుల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ కార్డు పొందటానికి ఎవరు అర్హులో.. ఏ బ్యాంకు ఎంత శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తుందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

• కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందటానికి రైతు వయసు కనీసం 18 నుండి 75 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ని సింగిల్ గా లేదా కలిపి కూడా తీసుకోవచ్చు.

• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొదలగు బ్యాంకుల నుండి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ని పొందవచ్చు

• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రైతులకు క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి రుణం తీసుకున్నట్లయితే ఏడు శాతం నుండి వార్షిక వడ్డీ మొదలవుతుంది. అలాగే పీఎన్‌బీ కిసాన్ క్రెడిట్ కార్డ్ వార్షిక వడ్డీ కూడా 7 శాతం నుండి మొదలు అవుతుంది.

• హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9 శాతం నుంచి, యాక్సిస్ బ్యాంక్ అయితే 8.85 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే 7 శాతం నుంచి వడ్డీ ప్రారంభం అవుతాయి.

ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ని పొందటానికి రైతులు కింద తెలియపరిచిన డాక్యుమెంట్లను జత చేసి ఆన్ లైన్ లో అప్లై చేయాలి. .

ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అవసరం అవుతాయి.అలానే పొలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ధృవీకరించిన డాక్యుమెంట్స్ తో పాటు ఇతర సెక్యూరిటీ డాక్యుమెంట్స్ సంబందించిన వివరాలు జత చేయాలి.