Begging Nayak : రాజకీయాల్లో విమర్శలు అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాయి. ప్రతిసారీ అంతకు మించి.. అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజాగా పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు.
‘పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ కాదు.. బెగ్గింగ్ నాయక్.. బిచ్చం నాయక్..’ అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అనిల్.
‘అలాగని నేననడంలేదు.. టీడీపీ వాళ్ళే అంటున్నారు..’ అంటూ అనిల్, నెపాన్ని టీడీపీ మీద నెట్టేశారు. ‘టీడీపీ బిచ్చం వేసే ముప్ఫయ్ నలభై సీట్లకు కక్కుర్తి పడతారా.? మొత్తంగా అన్ని సీట్లలోనూ పోటీ చేసి సీఎం అభ్యర్థిగా భీమ్లానాయక్ అనిపించుకుంటారా.?’ అంటూ పవన్ కళ్యాణ్‌కి అనిల్ సవాల్ విసిరారు.
అనిల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా జనసైనికులు మండిపడుతున్నారు. రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణమేననీ, పొత్తులు పెట్టుకున్నంతమాత్రాన అది బెగ్గింగ్ ఎలా అవుతుందన్నది జనసేన ప్రశ్న. ‘అయినా, టీడీపీ మమ్మల్ని కోరుకుంటోంది. మేం, టీడీపీ వైపు వెళ్ళడంలేదు.
మాకు బీజేపీ మిత్రపక్షం. మీకెవరు చెప్పారు మేం టీడీపీతో కలుస్తున్నామని’ అని జనసేన నేతలు సమాధానమిస్తున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్‌ని ‘బెగ్గింగ్ నాయక్.. బిచ్చం నాయక్’ అని అనిల్ అనడాన్ని తప్పు పడతున్న జనసైనికులు, అనిల్ కుమార్ యాదవ్‌ని ‘బెట్టింగ్ బ్రోకర్’గా అభివర్ణిస్తున్నారు.
మంత్రి పదవి ఊడిపోయేసరికి మరింత జోరుగా బెట్టింగుల్లో అనిల్ మునిగి తేలుతున్నారన్నది జనసైనికుల విమర్శ.