Beast Telugu Trailer : “బీస్ట్” తెలుగు ట్రైలర్ టాక్.. అంతా బానే ఉంది కానీ..!

Beast Telugu Trailer : తమిళ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా “బీస్ట్”. వరుణ్ ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
మరి ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతుండగా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాలూకా ఒక్కో భాష ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు అలా నిన్న హిందీలో ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా ఇప్పుడు తెలుగులో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
దీనితో మొన్నటి మీద మన వాళ్ళకి ఎక్కువ క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. యాక్షన్ బ్లాక్ లు అలాగే సినిమా స్క్రీనింగ్ అంతా మంచి రిచ్ గా కనిపిస్తుండగా తెలుగు ట్రైలర్ కి పెద్ద మార్పులు చేసినట్టు అనిపించడం లేదు.
కాకపోతే ఈ ట్రైలర్ చూస్తుంటే తన తుపాకీ సినిమా అలాగే ఫేమస్ వెబ్ సిరీస్ మనీ హేస్ట్ లోని ప్లాట్ గుర్తుకొస్తున్నాయి. రెండు కలిపి ఒక పవర్ ఫుల్ వ్యక్తి పై నడిపిస్తే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది.
అలాగే హీరో రోల్ కి ఒక ఫ్లాష్ బాక్ కూడా ఉన్నట్లు అర్థం అవుతోంది. మొత్తానికి అయితే ఒక్క విజయ్ రోల్ మినహా స్టోరీ పరంగా అయితే కొత్తదనం ఎక్కడా కనిపించడం లేదు. కానీ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలిడ్ గా ఉంది.
ఇక పూజా కి స్కోప్ నే లేదు. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఎంత విషయం ఉందో అనేది తెలుస్తోంది. మరి అది తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 13 వరకు ఆగాల్సిందే.
Beast telugu trailer talk not up to mark