Beast vs Kgf 2 : బ్రేకింగ్ అప్డేట్ : “కేజీఎఫ్ 2” కి పోటీగా “బీస్ట్” రిలీజ్.. కాకపోతే ముందే.!

Beast vs Kgf 2 : సాధారణంగా పలు భారీ సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని చిన్న సినిమాలు ఆగిపోక తప్పదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఎలాంటి సినిమాలు ఉన్నా కూడా పోటీకి మాత్రం కొందరు హీరోలు వెనక్కి “తగ్గేదేలే” అంటారు.
అలా మన టాలీవుడ్ లో అయితే ఆ మధ్య భారీ సినిమాలు “రాధే శ్యామ్”, ట్రిపుల్ ఆర్ ఉన్నపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనవరి 12 నే తన “భీమ్లా నాయక్” రిలీజ్ అంటూ పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్ళీ ఇలా కోలీవుడ్ లో స్టార్ హీరో థలపతి విజయ్ తన భారీ సినిమా “బీస్ట్” తో పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కి ఛాలెంజ్ విసురుతున్నాడు.
గతంలో ఈ సినిమా కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఏప్రిల్ 14నే వస్తుందని టాక్ ఉండగా తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్ పై సస్పెన్సు నెలకొంది. కానీ ఇప్పుడు ఈ సినిమాపై బ్రేకింగ్ అప్డేట్ ని అందించారు చిత్ర యూనిట్ వారు. దీనితో కూడా కేజీఎఫ్ 2 కి తమ సినిమా పోటీ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఒకరోజు ముందు ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు.
అయితే ఇది తమిళ నాట కేజీఎఫ్ కి భారీ దెబ్బ అని చెప్పాలి. విజయ్ సినిమాలు అక్కడ మామూలు మార్కెట్ చెయ్యవు. సో రెండు సినిమాలకి భారీ పోటీ తప్పదని చెప్పాలి. ఇక బీస్ట్ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
https://twitter.com/sunpictures/status/1506141517009752064?s=20&t=kNPiEq2hvncAwJng0ULbAA