Beast Movie : విజయ్ “బీస్ట్” సినిమాని నిషేధించిన ఆ దేశం..కారణం ఇదేనట.!

Beast Movie : తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో అపారమైన బాక్సాఫీస్ స్టామినా ఉన్న మరో సీనియర్ హీరో తలపతి విజయ్. తాను నటించిన సినిమాలు ఒక్కొక్కటి భారీ రికార్డులు సెట్ చేసుకుంటూ వెళ్లిపోతాయి.
లాస్ట్ టైం “మాస్టర్” తో అలాంటి ప్యాండమిక్ టైం లో కూడా భారీ వసూళ్ళని అందుకొన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో అనౌన్స్ చేసిన భారీ యాక్షన్ డ్రామానే “బీస్ట్”.
అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధంగా చేస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా ని ఓ దేశంలో బ్యాన్ చేస్తున్నట్టుగా షాకిచ్చారు.
aకువైట్ దేశంలో ఈ సినిమాకి ఎలాంటి షోలు అందులోని ఏ భాషలో కూడా పడవని అక్కడి సమాచార శాఖ మినిస్ట్రీ ఈ సినిమాని నిషేదిస్తున్నామని అనౌన్స్ చేశారు.
దీనికి గల కారణాలు కూడా వారు చెప్పారు. ఈ సినిమాలో భారీ లెవెల్లో వయోలెన్స్ ఉండడం ఒక కారణం కాగా పాకిస్తాన్ టెర్రరిస్టులకు సంబంధించి పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందుకే ఈ సినిమాని కువైట్ లో బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం వారు ఈ సినిమా యూనిట్ కి షాకిచ్చారు.
అలాగే దీనికి ముందు కూడా ఇలాంటి కొన్ని సినిమాలు బ్యాన్ చెయ్యడం జరిగింది అలాగే ఈ సినిమాని చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఏప్రిల్ 13న ఈ సినిమా రిలీస్ కాబోతుంది.