Beast Flop : తమిళ హీరో విజయ్ కొత్త సినిమా ‘బీస్ట్’ అట్టర్ ఫ్లాపయ్యింది. ఏమో, విజయ్ సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా తమిళంలో హిట్టయిపోతాయ్. తెలుగులో మాత్రం పరిస్థితి వేరే. ‘బీస్ట్’ సినిమా తెలుగు హక్కులు భారీగానే అమ్ముడుపోయాయంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.
సినిమా టిక్కెట్ ధరలు కూడా ‘బీస్ట్’ కోసం అదనంగా పెరిగాయి. అయినా ఏం లాభం.? సినిమా దారుణంగా దెబ్బతినేసింది.
తొలి రోజు వసూళ్ళు అస్సలేం బాగాలేవు. రేపు ఎలాగూ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వచ్చేస్తోంది. సో, ‘బీస్ట్’ ఒక్కరోజుకే దుకాణం సర్దేసినట్టు భావించాలేమో. హీరోయిన్ పూజా హెగ్దే ఈ సినిమాలో వున్నా, ఆమె కోసం కూడా థియేటర్లకు జనం పెద్దగా వెళ్ళినట్లు కనిపించలేదు.
వెళ్ళినోళ్ళేమో సినిమాలో పూజా హెగ్దేకి అస్సలు సీన్ లేదంటూ నిరాశ చెందుతున్నారు.
అసలు విజయ్ సినిమాలకి తెలుగులో అస్సలు సీన్ వుండదు. అది తెలిసీ, ‘బీస్ట్’ తెలుగు హక్కుల్ని ఎందుకు ఎక్కువ ఖర్చు చేసి కొనేసినట్టు.? కేవలం పూజా హెగ్దేని నమ్మకుని అంతలా డబ్బులు పెట్టేశారేమోనన్నది సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.
పూజా హెగ్దే, ‘బీస్ట్’ సినిమాని తెలుగులో ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించింది. విజయ్ మాత్రం ఆ ప్రయత్నమే చేయలేదు. దాంతో తెలుగు ఆడియన్స్ కూడా హర్ట్ అయినట్టున్నారు.