Bandla Ganesh: సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా నిర్మాతగా ఎంతోమంది సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన సినిమాలకు దూరంగా ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు.
ఇకపోతే తరచూ ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ నీ ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పోస్టులు చేస్తూ ఉంటారని పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కు ఎంతో మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ఒక దేవుడిగా పూజిస్తారు కానీ బండ్ల గణేష్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు చెప్పే విషయాల కారణంగా బండ్ల గణేష్ ను పవన్ దూరం పెడుతూ వస్తున్నారు. ఇలా పవన్ తనని దూరంపెట్టే విషయాన్ని బండ్ల గణేష్ జీర్ణించుకోలేక తరచూ త్రివిక్రమ్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ మరోసారి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి అలాగే త్రివిక్రమ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పోస్ట్ చేస్తూ… కొందరితో సంబంధాలు అనేవి అద్దె ఇల్లు లాంటివి.. వాటితో మనం ఎంత ప్రేమగా ఉన్న నిజాయితీగా ఉన్న ఎప్పటికీ మన వాళ్లు కారు అంటూ ఈయన పోస్ట్ చేశారు.
అద్దె ఇంటిపై ఎంత మమకారం పెంచిన ఏదో ఒక రోజు ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సిందే అలాగే కొంతమందితో మనం ఎంతో నిజాయితీగా ప్రేమగా ఉన్న వారు మనవాళ్లు కాదు అంటూ పవన్ కళ్యాణ్ దగ్గర తాను నిజాయితీగా ఉన్న ఆయన మాత్రం తనని దూరం పెడుతున్నారు అంటూ చెప్పకనే చెప్పేశారు. ఇలా బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.