Bangarraju OTT Release : ఓటిటిలో “బంగార్రాజు” వచ్చేస్తున్నాడట..ఏ రోజు నుంచి అంటే.!

Bangarraju OTT Release :  ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని హీరోలు నటించిన చిత్రం “బంగార్రాజు” కూడా ఒకటి. అక్కినేని నాగార్జున మరియు తన కొడుకు టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్యలు హీరోలుగా చేసిన పండుగ లాంటి క్రేజీ మల్టీ స్టారర్ ఇది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం దీనికి ముందు సినిమా అయినటువంటి “సోగ్గాడే చిన్ని నాయన” కి సీక్వెల్ గా చేసి భారీ హిట్ గా నిలుపుకున్నారు. అయితే ఈ సినిమాకి మొదట సాలిడ్ బిజినెస్ జరిగినా ఆ తర్వాత కాస్త డౌట్ లోనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఆ విడుదల టైం లోనే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై కొన్ని ఒహ్హగణాలు వచ్చాయి కానీ అవి నిజం కాదని తేలిపోయింది. కానీ ఇపుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే ఒక కీలక అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 18 నుంచి కానీ 19 నుంచి ప్రముఖ ఓటిటి స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో అందుబాటులోకి రానుందట.

దీనితో అక్కినేని అభిమనులు ఈ సినిమాని మిస్ అయ్యినవారు తొందరలోనే చూసేయొచ్చు. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దక్ష నగర్కార్, ఫరియా అబ్దుల్లా లు స్పెషల్ సాంగ్స్ లో నటించారు. అలాగే ఈ చిత్రానికి కూడా సీక్వెల్ వచ్చే సూచనలు ఉన్నాయి.