Bangarraju : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద పండుగ అందులోని మొదటి పండుగ అయినటువంటి సంక్రాంతి కానుకగా మొదట పలు భారీ సినిమాలే ప్లాన్ చేసినా కరోనా మూడో వేవ్ రూపంలో వచ్చి ఆ ఎగ్జైట్మెంట్ అంతటికీ బ్రేక్ వేసింది. ఇక ఈ గ్యాప్ లో సమయాన్ని ఎలా అయినా వినియోగించుకోవాలని పలు చిన్న సినిమాలు వచ్చేసాయి కానీ వాటిలో అయితే కొద్దో గొప్పో చూసే సినిమాలా వచ్చింది మాత్రం “బంగార్రాజు”.
అక్కినేని నాగార్జున తన కొడుకు నాగ చైతన్యలు హీరోలుగా రమ్య కృష్ణ మరియు యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పర్ఫెక్ట్ ఫెస్టివల్ సినిమాగా రిలీజ్ అయ్యింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ నే జరుపుకొని విడుదల కాగా మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ కూడా అందుకోవడంతో డెఫినెట్ గా అన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేకీవెన్ అయ్యిపోతుంది అని ట్రేడ్ వర్గాలు అనుకున్నారు.
అనుకున్నట్టే అయ్యింది కానీ ఒక్క ఏరియాలో తప్ప. అదే తెలంగాణ రీజియన్ నైజాం. ఇక్కడ ఈ సినిమాని 11 కోట్లు పెట్టి కొనుగోలు చెయ్యగా అందులో 7 కోట్ల షేర్ మార్క్ దగ్గరకి వచ్చి ఈ సినిమా ఆగిపోయిందట. ఇది గత వారమే అందుకున్నా ఇక్కడ నుంచి అసలు బంగార్రాజు ముందుకు కదలట్లేదట.
దీనితో ఇక్కడ మాత్రం డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక ఎన్ని వారాంతాలు వచ్చినా అక్కడ మాత్రం బంగార్రాజు బతికే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఈ ఒక్క ఏరియాలో మాత్రం బంగార్రాజుకి ఓటమి తప్పలేదని చెప్పాలి. మరి ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.