Bangarraaju: అక్కినేని నాగార్జున,నాగచైతన్య ప్రధాన పాత్రలో 2016 సంవత్సరంలో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో సంక్రాంతి పండుగను బంగార్రాజు క్యాష్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ఇదిలా ఉండగా బంగార్రాజు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున, జీ5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త సమాచారం ప్రస్తుతం నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో విడుదల కావడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే బంగార్రాజు చిత్రం కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జునతో పాటు జీ5 స్టూడియోస్ నిర్మించారు. కనుక ఈ సినిమా జీ 5 లోని స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 14 వ తేదీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.