‘సోగ్గాళ్లు’ షూటింగ్ మొదలెట్టేశారు

Bangaraju-movie shooting started today

అక్కినేని నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. 2016 సంక్రాంతి బరిలో నిలిచి వసూళ్లు రాబట్టింది. ఈ విజయం ఇచ్చిన ప్రేరణతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగ్ ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ టైటిల్ తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. అనేక కారణాలతో ఇన్నాళ్లు లేట్ అయిన ఈ మూవీ షూటింగ్ ఈ రోజు బుధవారం ప్రారంభమైనట్లుగా వెల్లడించారు.

Bangaraju-movie shooting started today

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన సోగ్గాడే చిన్నినాయనా మూవీలో నాగార్జున ద్విపాత్రాభినయంతో అభిమానులని అలరించాడు. ప్రీక్వెల్ లో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటించటం విశేషం. మనం మూవీ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేయటం ఇదే కావటంతో అక్కినేని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగార్రాజు స్టోరీని కళ్యాణ్ కృష్ణ చాలా బాగా రాసుకున్నారని హిట్ పక్కా అని సన్నిహితవర్గాల నుండి సమాచారం.

సోగ్గాడే చిన్నినాయనా మూవీలో నాగార్జున జోడిగా నటించిన రమ్య కృష్ణ ప్రీక్వెల్ లో కూడా మరోసారి మన్మథుడితో జతకడుతున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, నాగచైతన్యతో చేసే రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్ అని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.