జీవిత, రాజశేఖర్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

ఈ మధ్య సినిమాలు చెయ్యకపోయినా…బండ్ల గణేష్ తరచూ తన కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నచ్చిన వాళ్ళని పొగుడుతూ, నచ్చని వాళ్ళని తిడుతూ బండ్ల గణేష్ ఎప్పుడూ హడావిడి చేస్తుంటాడు.

ఇటీవల బండి సంజయ్ చేపట్టిన దీక్షలో పాల్గొన్న జీవితా, రాజశేఖర్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ మీటింగ్ లో పాల్గొన్న జీవిత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR  ను ఉద్దేశించి  పలు ఆరోపణలు చేసింది. హైదరాబాద్‌లోని ఆయా పబ్‌ల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలున్నాయని సెన్సేషనల్ కామెంట్ చేశారు. పవర్ చేతిలో ఉందని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నదని ఆరోపించారు. తెలంగాణ రాక ముందుకు, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులను లెక్కకడితే అసలు బయటికి వస్తాయని, ఎంత ఆస్తి ఉందో ప్పే ధైర్యం ఉందా..? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ కు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.

బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు  ఈ ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పార్టీల్లోనూ చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా’ అంటూ షాకింగ్ గా కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా జీవిత, రాజశేఖర్ దంపతులు గతంలో పలు పార్టీల్లో చేరినప్పటి ఫొటోలను సైతం ట్వీట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన పోస్టు  నెట్టింట వైరల్ గా మారింది.