త‌న దేవుడిపై మ‌రోసారి ప్రేమ‌ను కురిపించిన బండ్ల‌.. నీ ప్రేమ‌కు నేనెప్పుడు బానిస‌నే అంటూ ట్వీట్

చిరంజీవి వేసిన రూట్లో న‌డుస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాన్ అతి త‌క్కువ స‌మ‌యంలోనేఅశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. అభిమానుల‌లోనే కాదు సెల‌బ్రిటీల‌లోను ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది.ఆయ‌న‌తో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికి ప‌వ‌న్‌పై అభిమానం త‌ప్ప‌క పెరుగుతుంది. కొంద‌రైతే అత‌నిని దేవుడిగా కూడా కొలుస్తుంటారు. అలాంటి వారిలో బండ్ల గ‌ణేష్ ఒక‌రు. ప‌వ‌న్ పేరు చెబితే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయే బండ్ల ఎప్పుడు ప‌వ‌న్ జ‌ప‌మే చేస్తుంటారు.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా దంప‌తులు ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు క్రిస్మ‌స్ కానుక‌లు పంపారు. మ‌హేష్ బాబు, రానా త‌మ‌కు గిఫ్ట్ పంపినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని తమ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేయగా, తాజాగా బండ్ల గ‌ణేష్ కూడా త‌న‌కు గిఫ్ట్ అందిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేశాడు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో దగ్గర గిఫ్ట్‌ పెట్టి “మీ ప్రేమకు ఎప్పుడు బానిసనే పవన్ కళ్యాణ్ నా దైవం” అంటూ పోస్ట్ చేసిన తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు బండ్ల గణేష్‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్టర్ ఇచ్చిన బండ్ల గ‌ణేష్ కొన్నాళ్లు రాజ‌కీయాల పేరుతో సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అక్క‌డ త‌న ఆట‌లు న‌డ‌వ‌క‌పోయే స‌రికి తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చారు. ఆ మ‌ధ్య స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించిన బండ్ల ఇప్పుడు నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని మరోసారి ప‌రీక్షించుకోనున్నాడు. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు ఆ సినిమాతో మ‌రో సారి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయాల‌ని అనుకుంటున్నాడు. మ‌రి అదెప్పుడు జ‌రుగుతుందో చూడాలి.