నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వేడుకలో వీర లెవల్ స్పీచ్ ఇచ్చి బాగా వైరల్ అయ్యాడు. రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. పవన్ డేట్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అయితే పవన్ నుండి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ప్రజెంట్ పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిల్ రెండు సెట్స్ మీద ఉండగా ఇంకొకరి మొదలవడానికి సిద్ధంగా ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
పవన్ కరోనా బారిన పడకుండా ఉంటే అనుకున్న సమయానికి ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయ్యే వీలుండేది. పవన్ విశ్రాంతిలో ఉండటం, లాల్ డౌన్ పడటంతో అన్ని చిత్రాలు మూడు నెలలు వెనక్కి వెళ్లాయి. ఈ ఎఫెక్ట్ బండ్ల గణేష్ మీద స్పష్టంగా పడుతుంది. పవన్ ఇప్పుడు కొత్త సినిమాలకు సైన్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. అన్నీ బాగుంటేనే ఆయన డేట్స్ పట్టుకోవడం కష్టం. అలాంటిది ఈ డైలామాలో పవన్ చేతే ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి బండ్ల గణేష్ వేరే హీరోను చూసుకోవడం ఉత్తమం. కాదు కూడదు పవన్ తోనే సినిమా చేస్తాను అంటే మాత్రం ఎదురుచూపులు తప్పవు.