Bandla ganesh : వైరల్ – బండ్ల గణేష్ ఆడియో లీక్..త్రివిక్రమ్ ని అంత మాట అన్నాడేంటి.!

Bandla ganesh : టాలీవుడ్ లో ఉన్నటువంటి అనేక మంది నటులు మరియు స్టార్ నిర్మాతలలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. అయితే బండ్ల గణేష్ కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎన్నో కాంట్రవర్సీలలో ఇరుక్కొని లాస్ట్ ని నాలుక కరుచుకున్నాడు. మరి ఇలాంటి బండ్ల గణేష్ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో భజన చేస్తాడో అందరికీ తెలిసిందే.

అది ఒకింత అతి లా అనిపించినా పవన్ అభిమానులు అయితే దానిని ఎంజాయ్ చేస్తారు. ఇలా పవన్ ప్రతీ సినిమా ఫంక్షన్ లో కూడా బండ్ల గణేష్ స్పీచ్ కూడా ఒక మేజర్ హైలైట్ గా నిలిచిపోయే రేంజ్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు కూడా అంతా “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో అతడి స్పీచ్ కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

బండ్ల గణేష్ ఫోన్ కాల్ ఒకదాన్ని ఎవరో లీక్ చేసారు. ఇందులో పవన్ అభిమాని బండ్ల గణేష్ కి ఫోన్ చేసి భీమ్లా నాయక్ ఫంక్షన్ కి వస్తున్నారా లేదా అని అడగ్గా దర్శకుడు త్రివిక్రమ్ పై గణేష్ సంచలన కామెంట్స్ చేశారు. నాకు రావాలనే ఉంది. స్పీచ్ కూడా రెడీ చేసుకున్నాను కానీ ఆ త్రివిక్రమ్ గాడే రానివ్వట్లేదు అని సంచలన కామెంట్ చెయ్యడం ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది.

త్రివిక్రమ్ ని గాడు అనడం ఏమిటి అని ఒకింత పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది త్రివిక్రమ్ దృష్టికి ఇంకా వెళ్లిందో లేదో కానీ బండ్ల గణేష్ అన్న మాటలు అయితే ఒకింత బాధాకరం కాగా ఈ ఆడియో టేప్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.