నిర్మాత బండ్ల గణేష్ ఈమధ్య వార్తల్లో వ్యక్తి అయిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ‘వకీల్ సాబ్’ వేడుకలో పవన్ గురించి భక్త కన్నప్ప స్పీచ్ ఇచ్చి హైలెట్ అయ్యారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మీమర్స్ బండ్ల వీడియోలను ఎడిట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అలా సోషల్ మీడియాలో దుమ్ములేపిన ఆయన తాజాగా ఒక సినిమా రీమేక్ విషయంలో చర్చల్లో నిలిచారు.
ఆ సినిమానే ‘మండేల’. తమిళంలో కమెడియన్ యోగిబాబు నటించిన సినిమా ఇది. నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలై మంచి ప్రశంసలు తెచ్చుకుంది. విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. రాజకీయాల మీద సెటైర్ వేసినట్టు ఉంటుంది ఈ చిత్రం. దీన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, అందులో బండ్ల గణేష్ లీడ్ రోల్ చేస్తారని పుకార్లు పుట్టాయి. మళ్ళీ ఇప్పుడేమో బండ్ల తప్పుకున్నారని, సునీల్ రీమేక్ చేస్తారని వార్తలు మొదలయ్యాయి. వీటిని నోటీస్ చేసిన బండ్ల అసలు తాను సినిమాకు ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి అంటూ విషయాన్ని తేల్చేశారు.