బిగ్ ట్రీట్ : పవన్ – బాలయ్య పేస్ టు పేస్ .. త్రివిక్రంతో బాలయ్య ఫోన్ కాల్.!

గత కొన్ని రోజులు కితమే టాలీవుడ్ స్టార్ హీరోలు అందులోని రెండు వేరు వేరు వేరు పెద్ద కుటుంబాలుకి చెందిన హీరోలు అయినటువంటి బాలకృష్ణ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే స్టేజ్ పై కనిపించొచ్చు అని.. ఓ షాకింగ్ రూమర్ బయటకి వచ్చింది. అయితే దీనిపై ఇప్పుడు పెద్ద కన్ఫర్మేషన్ నే వచ్చింది అని చెప్పాలి.

బాలయ్య హోస్ట్ గా చేస్తున్నటువంటి మాస్ ఎంటర్టైనింగ్ షో ఆహా లో వచ్చే అన్ స్టాప్పబుల్ సీజన్ రెండోది స్టార్ట్ కాగా ఇప్పుడు రెండో ఎపిసోడ్ కి కూడా చేరుకుంది. మరి దీనికి అనుకున్నట్టు గానే హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ విశ్వక్ సేన్ లు హాజరు కాగా దీనిపై అదిరే ప్రోమో ని రిలీజ్ చేశారు.

మరి ఇది చూసాక అయితే పవన్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం స్టార్ట్ అయ్యిపోయింది. ఇందులో బాలకృష్ణ త్రివిక్రమ్ తో ఫోన్ కాల్ మాట్లాడి స్పీఎకర్ పెట్టారు. ఇందులో బాలకృష్ణ త్రివిక్రం నా షో కి ఎప్పుడు అంటే మీరెప్పుడు అంటే అప్పుడే అని త్రివిక్రమ్ చెప్పారు.

మరి దీనికి వస్తే ఎవరితో రావాలో తెలుసుగా అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హీటెక్కించాయి, అంటే ఈ షోలో త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా కూర్చొని బాలయ్య తో పేస్ టు పేస్ లో ఉంటారని చెప్పాలి. మరి ఈ ఊహించని కలయిక నిజంగానే ఉంటుందా లేక ఫోన్ కాల్ తోనే ఆగిపోతుందా అని చూడాలి. 
Unstoppable with NBK Season 2 | Episode 2 Promo | Vishwak Sen & Siddhu Jonnalagadda | ahaVideoIN