నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా ఊహించని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఓటిటి షో స్వయంగా తాను హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. దీనితో ఈ షో పై ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. తెలుగులో పాపులర్ అయ్యినటువంటి “ఆహా” యాప్ కోసం గాను బాలయ్య హోస్ట్ గా “అన్ స్టాప్పబుల్” అనే ఇంట్రెస్టింగ్ సెలెబ్రెటీ షోకి ఓకే చెప్పారు.
మరి రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యిన ఈ షో ఈవెంట్ తర్వాత మరిన్ని ఆసక్తికర విషయాలే బయటకు వస్తున్నాయి. వాటి ఈ షోలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉండగా ఈ సీజన్ అంతటికీ బాలయ్య 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అంటే ఒక్కో ఎపిసోడ్ కి 40 లక్షలు మేర ఛార్జ్ చేస్తున్నారట. దీనితో తన రెమ్యునరేషన్ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అయితే బాలయ్య తన భారీ చిత్రం “అఖండ” కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీగా ఉంచిన సంగతి తెలిసిందే.