Balayya Next : బలపడుతున్న బాలయ్య మాస్ ప్రాజెక్ట్.. కీలక పాత్రకి జయమ్మని దింపారుగా.!

Balayya Next : నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక సాలిడ్ హిట్ ని అందించారు. తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన “అఖండ” సినిమా కని వినీ ఎరుగని రీతి విజయాన్ని నమోదు చేసి మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేసింది.

మరి ఈ సినిమా తర్వాత గతంలో చేసిన తప్పుల్లా కాకుండా బాలయ్య మంచి లైనప్ ని సిద్ధం చేస్తున్నారు. అలానే మరో మాస్ దర్శకుడు అయినటువంటి గోపీచంద్ మలినేని తో ఓ కొత్త భారీ మాస్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్డేట్ మరింత వేడి పుట్టిస్తుంది.

గత కొన్ని రోజులు కితమే మేకర్స్ కన్నడ ఇండస్ట్రీ స్టార్ నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడని రివీల్ చేశారు. ఇక ఈరోజు ఇంకో బిగ్ అప్డేట్ ని వారు అందించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ మరియు వెర్సిటైల్ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ని ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్పారు.

ఆల్రెడీ గోపీచంద్ తో లాస్ట్ టైం ఈమె “క్రాక్” లో జయమ్మ గా కనిపించి సూపర్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈసారి కూడా అంతే కీలక పాత్రకి గాను ఈ సినిమాలో తీసుకున్నారు. దీనితో ఈ సినిమా మరింత బలపడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి గాను థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.