Balayya : అక్కడ బాలయ్య గట్టెక్కినా.. పవన్ బొమ్మకి మాత్రం అంత సీన్ లేదా?

Balayya :ఇప్పుడు సినిమా ఫలితం అనేది ఎలా మారింది అంటే సినిమాలో హీరో ఎంత పెద్ద తోప్ అయినా కూడా ఆ సినిమలో కంటెంట్ లేకపోతే అది ప్లాప్ గానే మారుతుంది. అలాగే ఓ సినిమా ఫలితం అనేది మన దగ్గరతో పాటు ఓవర్సీస్ ఆడియెన్స్ లో కూడా కంప్లీట్ గా చాలా తేడా ఉంటుంది. కొన్ని మన దగ్గర ఆడేవి అక్కడా ఆడుతాయి కానీ కొన్నిటికి సమస్యే లేదు..
అయితే ఎక్కువగా ఓవర్సీస్ లో క్లాస్ సినిమాలే హిట్ అయ్యిన దాఖలాలు ఉన్నాయి. అయితే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మాస్ సినిమాలు హిట్ అవ్వడం గట్టెక్కడం జరిగింది. ఇప్పుడు అదే లిస్ట్ లోకి బాలయ్య లేటెస్ట్ సినిమా “అఖండ” చేరుతుంది. ఇది ప్యూర్ మాస్ మసాలా డ్రామా. అయినా కూడా ఓవర్సీస్ మార్కెట్ లో భారీ వసూళ్లను అందుకొని నిలకడగా దూసుకెళుతుంది.
మరి ఈ లిస్ట్ లో నాన్ పాన్ ఇండియా సినిమాలకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” ఫలితాన్ని ముందే ఊహించవచ్చు. ఇది కూడా పక్కా మాస్ డ్రామా పైగా మంచి కంటెంట్ తో కూడుకున్నది అయినా కూడా ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకి అంత సీన్ చెప్పొచ్చు.
పవన్ స్టార్డం తో భారీ ఓపెనింగ్స్ వచ్చినా దీనికి అయ్యే బిజినెస్ తో అయితే చివరికి స్వల్ప నష్టాలు అయినా తప్పవు. ఎందుకంటే అక్కడ రీమేక్ సినిమాకి మార్కెట్ చాలా తక్కువ ఆల్రెడీ ముందే అక్కడ అన్ని సినిమాలు చూసేసే ఉంటారు. సో భీమ్లా నాయక్ కి కూడా ఊహించని ఫలితమే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దీనికి ఉదాహరణగా మూడేళ్ళ తర్వాత పవన్ కం బ్యాక్ సినిమాగా వచ్చిన వకీల్ సాబ్ ఫలితాన్నే చెప్పొచ్చు. దాన్ని బాలయ్య అఖండ కేవలం రెండు రోజుల్లో బ్రేక్ చేసేసింది. సో భీమ్లా నాయక్ కి మళ్ళీ అక్కడ కష్టాలు తప్పవ్.