చిరంజీవిని ఎందుకు లాగారు చెప్మా.!

ఏ చిన్న అవకాశమొచ్చినా చిరంజీవిపై సెటైర్లు వేసేందుకు వెనుకాడరు మోహన్ బాబు. ఈ మధ్య ‘మా’ ఎలక్షన్స్ పుణ్యమా అని, చిరంజీవి, మోహన్ బాబు మధ్య టెర్మ్ సరిగ్గా లేని సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ ఓటీటీ టాక్ షోలో మోహన్ బాబు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలయ్య, మోహన్ బాబు మధ్య చిరు ప్రస్థావన వచ్చింది.

అల్లు రామలింగయ్య కూతురును పెళ్లి చేసుకోవడం వల్లే చిరంజీవి గొప్పోడయ్యాడు.. అనే అర్ధం వచ్చేలా ఆ సందర్భంలో మోహన్ బాబు, చిరంజీవి గురించి మాట్లాడడం పెద్ద చర్చకు దారి తీసిందిప్పుడు. వారి మధ్య చిరంజీవి లేనప్పుడు ఆయన ప్రస్థావన ఎందుకు తీసుకొచ్చారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.

అనవసరంగా చిరంజీవిని లాగుతున్నారు.? క్యాజువల్‌గానే బాలయ్య, చిరు ప్రస్థావన తీసుకొచ్చారా.? లేక, ఈ ప్లానింగ్‌లో తెర వెనుక హస్తమేదైనా ఉందా.? ఈ ఛానెల్ నిర్వాహకులు అల్లు అరవింద్ కాబట్టి, కావాలనే అల్లు అరవింద్ బాలయ్యతో ఆ ప్రశ్నలు అడిగించి, ఈ చిచ్చు రాజేశారా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.