ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ర్ట వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో వైద్య పరంగా ఇబ్బందులు ఎదురవుతుతున్నాయి. ప్రభుత్వ పరంగా సమకూర్చాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ సేవలు అందరికీ అందడం లేదు. ఈ నేపథ్యంలో నటసింహ, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజక వర్గం హిందుపురం కోసం నడుం బిగించారు.
తన నియోజక వర్గంలో కరోనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి 55 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ డబ్బుతో కీలకమైన కొవిడ్ కిట్లు కొనుగోలు చేయనున్నారు. ఆ రకంగా బాలయ్య తన నియోజక వర్గంపై ప్రేమను..సేవను చాటుకున్నారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు విరాళాలు ఇవ్వడం అన్నది జరగదు. అసలు తమ పార్టీ అధికారంలో లేకపోతే పట్టించుకున పాపన కూడా పోరు చాలా మంది ప్రజా ప్రతినిధులు. కానీ బాలయ్య మాత్రం ఎంతో మంచి మనసుతో నియోజక వర్గ ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని సేవా దృక్ఫధంతో భారీ ఎత్తున విరాళం ప్రకటించడం అన్నది నిజoగా గొప్ప విషయం.
బాలయ్య రాజకీయ నాయకుడు కన్నా ముందు ఓ నటుడు. ఆ హోదాలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. మరి ఇప్పుడు బాలయ్య నటుడి హోదాలో విరాళం ఇచ్చారా? ప్రజా ప్రతినిధుడి హోదాలా ఇచ్చారా? అన్నది ఆసక్తికరం . కాగా ఈ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో సీఎం సంతోషంగా ఫీలయ్యారు. బాలయ్య ఇలా రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తుంటే జగన్ మనసులో రియల్ హీరోగాను వెలిగిపోరు.