Balayya : వైరల్ : తన షోలో పవన్ పై బాలయ్య ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Balayya : టాలీవుడ్ లో పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మోస్ట్ పాపులర్ కుటుంబాలు వారిని అభిమానించే అభిమానులు ఇలా కొంతమంది హీరోలకి అవతల ఫ్యామిలీ హీరోల మధ్య ఒక రకమైన ఆసక్తికరమైన వాతావరణం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం మరియు నందమూరి కుటుంబం అభిమానుల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన వరకు పలు సందర్భాల్లో ఓపెన్ గానే ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు అందులోనూ నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసినవి వైరల్ అవుతున్నాయి.

తన ఓటిటి షో లో దర్శకుడు పూరి జగన్నాథ్ తో మాట్లాడుతూ ఒకప్పుడు పవన్ చేసిన సినిమాల నుంచి పూరి పవన్ ని ఎలా మార్చేసాడో చెప్పారు. ఒక తమ్ముడు, తొలిప్రేమ లాంటి సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్ ని నువ్వు బద్రి అనే సినిమాతో నువ్ నందా అయితే ఏంటి అనే డైలాగ్స్ చెప్పించారు అని పవన్ ని ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ పవన్ అభిమానులు నడుమ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ భారీ సినిమాలు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు.