HomeNewsబాలయ్య హీరోయిన్ 'కెలుకుడు' మామూలుగా లేదు

బాలయ్య హీరోయిన్ ‘కెలుకుడు’ మామూలుగా లేదు

Radhika Aptes Shocker About Surgeries | Telugu Rajyam

గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించాలంటే అందుకు తగ్గట్లుగా రకరకాల సర్జరీలను ఆశ్రయిస్తుంటారు అందాల భామలు. అలా సర్జరీలు చేయించుకున్నవారు కొందరు బయటకి చెప్పడానికి ఇష్టపడతారు. ఇంకొందరు ఇష్టపడరు. అయినా ఇది సర్వ సాధారణమైన విషయం.

ఇక అసలు విషయానికి వస్తే, ఏదో రకంగా సంచలన వ్యాఖ్యలు చేసి, లైమ్ లైట్‌లో ఉండాలనుకునే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే, తాజాగా ఈ సర్జరీల విషయమై తనదైన శైలిలో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సర్జరీలు చేయించుకునేవారు సహజమైన అందం గురించి మాట్లాడకూడదు.. అనేది ఆమె మాటల్లోని సారాంశం. అందంగా కనిపించడానికి తనను చాలా మంది సర్జరీ చేయించుకోమని సూచించారట.

కానీ, అలా సర్జరీ చేయించుకోవడం ద్వారా వచ్చిన అందం తనకిష్టం లేదనీ, సహజంగా కనిపించడమే తనకిష్టమనీ రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అంతేకాదు అలా ఎరువు తెచ్చుకున్న అందం తనకు లేదు కాబట్టే తాను ఎవ్వరికీ నచ్చననీ చెబుతోంది.

రాధికా ఆప్టే మాటలు చాలా మంది హీరోయిన్లను బాధించాయి. వారి మనోభావాలు దెబ్బతినడంతో రాధికా ఆప్టే వ్యాఖ్యలను తప్పు పడుతూ సోషల్ మీడియాలో తమకు తోచిన విధంగా (గుస్సా అవుతూ) రెస్పాండ్ అవుతున్నారు. మరి వారి రెస్పాన్స్‌ని రాధికా ఆప్టే ఎలా తిప్పి కొడుతుందో.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News