ఇప్పుడు నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తన కెరీర్ NBK 107 కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే బాలయ్య లు కూడా తమ కెరీర్ లో భారీ హిట్ సినిమాలు అనంతరం చేస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు మాస్ ఆడియెన్స్ లో నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి ఇంట్రస్టింగ్ ఊహాగానాలు సినీ వర్గాల్లో వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఫైనల్ గా ఇపుడు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి రేస్ లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా సినీ వర్గాలు ఇప్పుడు తెలుపుతున్నాయి.
అయితే ఈ రిలీజ్ తో బాలయ్య భారీ డేర్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని జనవరి 12కి లాక్ చెయ్యాలని చూస్తున్నారట. కానీ సరిగా అదే రోజు ప్రభాస్ ఆదిపురుష్ ఆల్రెడీ పాగా వేసి ఉంది. పైగా దీనితో పాటుగా తమిళ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలు కూడా ఈ డేట్ లోనే వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
మరి ఇలాంటి రెండు సినిమాలతో మూడో సినిమాగా బాలయ్య రాబోతున్నట్టు గట్టి టాక్ ఇప్పుడు మొదలైంది. దీనితో అయితే ఈ రసవత్తర పోటీ అంశం తెలుగు సినిమా దగ్గర మరింత హీట్ గా మారింది. మరి లాస్ట్ కి అయితే చిత్ర యూనిట్ ఏం చేస్తారో చూడాలి.