ఇండస్ట్రీ టాక్ : తన మాస్ టైటిల్ తోనే బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రీసెంట్ గానే తన భారీ చిత్రం “అఖండ” సినిమా పూర్తి చేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాతో శ్రీనుతో చేసిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఆ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్య సినిమాలకు పర్టిక్యులర్ గా టైటిల్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

తన ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ టైటిల్ పడితే దాని ప్రభావం మాస్ ఆడియెన్స్ ఓ గట్టిగానే ఉంటుంది. అందుకే బాలయ్య సినిమాలకు మేకర్స్ ఆచి తూచి టైటిల్స్ పెడతారు. మరి ఇదిలా ఉండగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ప్రకారం అయితే బాలయ్య తర్వాత చెయ్యబోయే సినిమా గోపీచంద్ మలినేనితో ప్లాన్ చేసిన సినిమాకి బాగా తెలిసిందే ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు.

ఈ చిత్రానికి మాస్ స్లోగన్ “జై బాలయ్య” టైటిల్ నే చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కనుక నిజం అయితే దీనికి మించి కిక్ బాలయ్య అభిమానులకు ఉండదని చెప్పాలి.