Akhanda : ఆంధ్రా నుంచి అమెరికా వరకు “అఖండ” సెన్సేషన్..3 రోజుల కలెక్షన్ ఎంతంటే..

Akhanda : నందమూరి నటసింహం నందమూరి బాలయ్య హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ మసాలా చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నడుమ మంచి టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రం అనుకున్న అంచనాలను మించి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

మన ఆంధ్రా నుంచి ఓవర్సీస్ మార్కెట్ అమెరికా వరకు కూడా మొదటి రోజు నుంచి భారీ వసూళ్లను అందుకొని ఆల్రెడీ కొన్ని చోట్ల బ్రేకీవెన్ కొట్టేసింది. ఇక గత గురువారం నుంచి నిన్న శనివారం వరకు కూడా మూడు రోజులు వసూళ్ల వివరాల్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొత్తం 29 కోట్ల 25 లక్షల షేర్ ని రాబట్టగా 44 కోట్ల 60 లక్షలు షేర్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అలాగే యూఎస్ఏ మార్కెట్ లో అయితే 7 లక్షల డాలర్స్ మార్క్ ని సునాయాసంగా క్రాస్ చేసి 1 మిలియన్ డాలర్ దిశగా వెళుతుంది. అయితే మన కరెన్సీ ప్రకారం ప్రీమియర్స్ తో ఓవర్సీస్ మార్కెట్ లో అఖండ 5.2 కోట్లు రాబట్టింది. అలాగే ఆల్రెడీ అక్కడ కూడా పెట్టిన మొత్తాన్ని రాబట్టేసింది.

ఇక అలాగే ఆస్ట్రేలియా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 80 లక్షలు ఈ చిత్రం రాబట్టి అన్ని చోట్లా కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. మరి ఇలా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మూడు రోజుల్లో అఖండ సుమారు 35 కోట్ల షేర్ ని మూడు రోజుల్లో రాబట్టేసి ఆల్రెడీ లాభాల్లోకి వెళుతుంది.