బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ అమౌంట్ ఇది 15 కోట్లు

Balakrishna's Akhanda rights sold for 15 crore

Balakrishna's Akhanda rights sold for 15 crore

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఊహించని రీతిలో ప్రేక్షకుల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో కూడ మంచి డిమాండ్ తెచ్చుకుంది. టైటిల్ టీజర్ బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. హక్కుల కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీపడ్డాయి. డిజిటల్, శాటిలైట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

డిజిటల్ హక్కులను హాట్ స్టార్ కొనుగోలు చేయగా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. రెండూ కలిపి రూ.15 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఈ డీల్ నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టనుంది. బాలయ్య కెరీర్లోనే ఇది కాస్ట్లీయట్ బిజినెస్. ఆయన గత చిత్రాలేవీ ఈ స్థాయిలో అమ్ముడుకాలేదు. ఇక థియేట్రికల్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. సినిమా మీదున్న హైప్ చూస్తుంటే అవి కూడ రికార్డ్ మొత్తానికే అమ్ముడయ్యేలా ఉన్నాయి. మొత్తానికి ‘అఖండ’ చిత్రం చాలా ఏళ్ల తర్వాత బాలయ్య స్టార్ డమ్ ను రుజువుచేసే చిత్రంగా నిలుస్తోంది.