నందమూరి బాలకృష్ణ అంటే మాస్ జనాల్లో ఫాలోయింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన సినిమాలు మాత్రం రికార్డులకి, కలెక్షన్లకి దూరం. ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడ భీభత్సమైన వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. ఆయన సినిమాలకు వచ్చే ప్రీరిలీజ్ బజ్ కూడ అంత విపరీతంగా ఏమీ ఉండేది కాదు. కానీ ‘అఖండ’ చిత్రం ఆ పరిస్థితుల్ని మార్చి వేసింది. ఒకే ఒక్క టైటిల్ టీజర్ సినిమాకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ కొట్టేసింది.
ఇప్పటికే టీజర్ 25 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే భారీ హయ్యస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచింది. బాలయ్య మేకోవర్, డైలాగ్ బాగా పేలాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. ఈ టీజర్ తోనే బాలయ్యకు యూట్యూబ్ రికార్డులు మొదలయ్యాయి. కొన్ని భారీ సినిమాల రికార్డుల్ని కూడ ఈ టీజర్ బీట్ చేసేసింది. ఈ హైప్ చూస్తుంటే సినిమాకు ఓపెనింగ్స్ కూడ బీభత్సంగా ఉంటాయని అర్థమవుతోంది. మొత్తానికి ‘సింహ, లెజెండ్’ తర్వాత బాలయ్యకు అంత పెద్ద సినిమా, అంత హైప్ ఉన్న సినిమా ఇదే అవుతుందనడంలో సందేహమే లేదు.