బాలయ్య దెబ్బకు ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బద్దలు

Balakrishna's Akhanda breaks RRR records

Balakrishna's Akhanda breaks RRR records

నందమూరి బాలాకృష్ణ సినిమాలు అంటే అభిమానుల్లో ఉత్సాహం తారా స్థాయిలో ఉంటుంది. బాలయ్యకు మాస్ జనాల్లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఎంత మాస్ క్రేజ్ ఉన్నా రికార్డులకు మాత్రం ఆయన సినిమాలు చాలా దూరం. వసూళ్ల విషయమే కాదు.. యూట్యూబ్ రికార్డుల పరంగా కూడ ఆయన గత సినిమాలు పెద్ద ఎఫెక్ట్ చూపింది లేదు. కానీ ఈసారి చిత్రంగా బాలకృష్ణ రికార్డుల వేట సాగిస్తున్నారు. ఏకంగా ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులనే బద్దలుకొడుతున్నారు ఆయన.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త చిత్రం ‘అఖండ’. ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ విడుదలైంది. టీజర్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాలయ్య కొత్త మేకోవర్, డైలాగ్స్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ‘కపాలం పగిలిపోద్ది’ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది. దీంతో టీజర్ 24 గంటల్లో 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డ్ నెలకొల్పింది. ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ 7 మిలియన్ల వ్యూస్ సాధించడానికి 4 వారాలు తీసుకుంటే భీమ్ ఫర్ రామ్ టీజర్ 12 మిలియన్ల వ్యూస్ టచ్ చేయడానికి 4 వారాలు పట్టింది. కానీ ‘అఖండ’ మాత్రం 24 గంటల్లోనే 11 మిలియన్ల మార్క్ టచ్ చేసింది. ఇదే ఊపు వసూళ్ళలో కూడ కనబడితే బాగుంటుంది.