కళ్యాణ్ రామ్ కోసం బాలకృష్ణ గంట టైమ్ ఇవ్వలేకపోయారా ?

Balakrishna supposed to do voice over for Bimbisara motion poster
Balakrishna supposed to do voice over for Bimbisara motion poster
కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ ఇద్దరూ బాబాయ్ బాలకృష్ణ అంటే అమితమైన గౌరవంతో ఉంటారు.  కుటుంబ, రాజకీయ పరమైన విబేధాల వలన బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ దూరం పాటించేవారు.  ఆ దూరం కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ వరకు కొనసాగింది.  కానీ అన్నదమ్ములు ఇద్దరూ బాబాయితో సఖ్యతగా ఉండాలని ఆశపడుతూనే ఉన్నారు.  కానీ ఎందుకో కుదరడంలేదు. బాలకృష్ణ ఎప్పుడో ఒకసారి ఒకడుగు ముందుకు వేసేవారు కానీ మళ్లీ పాత పద్దతిలోకే వెళ్లిపోయేవారు.  తన పనేదో తానే చూసుకుంటూ ఉంటారు. అందుకే సందర్భం దొరికినప్పుడల్లా బాబాయిని కలుపుకుని పోవాలని అనుకుంటుంటారు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్. 
 
అందులో భాగంగానే తన కొత్త చిత్రం ‘బింబిసార’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు బాబాయ్ చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసుకున్నాడు.  కానీ బాలకృష్ణ బిజీ షెడ్యూల్స్ మూలాన కళ్యాణ్ రామ్ కోసం టైమ్ కేటాయించలేకపోయారు.  నిజానికి వాయిస్ ఓవర్ చెప్పడానికి పెద్ద టైమ్ పట్టదు.  ముఖ్యంగా బాలకృష్ణ లాంటి నటుడికి అది చాలా చిన్న విషయం. సింగిల్ టెక్లో రెండు మూడు డైలాగులు చెప్పగలరు.  కానీ చేయలేదు. అదే టైంలోనే రామారావుగారి పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ దండకం పాడారు.  బహుశా ఆ పని పెట్టుకోవడం వల్లనే కళ్యాణ్ రామ్ కోసం మోషన్ పోస్టర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయి ఉండవచ్చు.  కళ్యాణ్ రామ్ కాంపౌండ్ వ్యక్తులు ఇదే చెబుతున్నారు. అంతేకాదు ఈసారి టీజర్ కు ఖచ్చితంగా బాలకృష్ణ వాయిస్ ఓవర్ చెబుతారని అంటున్నారు కూడ.  మరి ఈసారైనా బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కోసం కాస్త టైమ్ ఇవ్వగలతో లేదో చూడాలి.