Unstoppable 2: షోకి బాలకృష్ణ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా

ఒకప్పుడు సినిమాల ద్వారా మాత్రమే సంపాదించే హీరోలు, హీరోయిన్లు ఇప్పడు సంపాందించుకోవడానికి చాలా మార్గాలు వచ్చాయి. వాణిజ్య ప్రకటనలు, టీవీ షోస్ ద్వారా కూడా సెలెబ్రిటీలు బాగా సంపాదిస్తున్నారు.

తెలుగు లో టీవీ షో హోస్ట్ గా తనకు పోటీ లేరని నిరూపించుకున్న నాగార్జున తర్వాత అదే రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బాలకృష్ణ. ఐ యాం ఆల్ రౌండర్.. ఐ కెన్ డు ఎనీ థింగ్ ..అంటూ నందమూరి నటసింహం బాలయ్య తనలోని సరికొత్త టాలెంట్ ను జనాలకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.

ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య హోస్ట్ గా మారిన బాలకృష్ణ సీసన్ 2 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో కోసం బాలయ్య 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొదటి సీజన్ కి ఆరు కోట్లు తీసుకున్న బాలయ్య.. రెండో సీజన్ కి ఆరు కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ 12 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా బాలయ్య తన సొంత ఖర్చులకు వాడుకోవటం లేదట. మొత్తం బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి ఫండ్ గా ఇచ్చేస్తున్నారట.