Rajamouli: రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం బాలకృష్ణ వైపు చూస్తున్నారా…?

Rajamouli: రాజమౌళి ,రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. అంతేకాకుండా ఈగ బాహుబలి సినిమాలతో పానీయాల వల్ల తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా తన పేరునే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరుని తారాస్థాయికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాని విడుదలకు సిద్ధం చేశారు. తర్వాతి సినిమా రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్నట్టు సమాచారం. అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమా మల్టీస్టారర్ అనే సమాచారం. ఇంకొక హీరో కోసం రాజమౌళి బాలకృష్ణ గురించే ఆలోచిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్. బాలకృష్ణ గారితో రాజమౌళి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట, సింహాద్రి సినిమా కూడా మొదట బాలకృష్ణ గారిని అనుకున్నారనేవార్త పెద్ద ఎత్తున వినిపించినప్పటికీ ఇందులో నిజం లేదని తర్వాత తెలిసిపోయింది.

మహేష్ బాబు సినిమా కథ ప్రకారం 40 నిమిషాల ఎపిసోడ్ కోసం ఒక కీలకమైన పాత్ర ఉందని ఆ పాత్ర బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం.రాజమౌళి మహేష్ బాబు సినిమా ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, ఇంకా కథలో ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో కూడా తెలియదు. ఇవన్నీ ప్రాథమికంగా వస్తున్న ఆలోచనలు మాత్రమే, కానీ ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే రాజమౌళి, మహేష్ బాబు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చే సినిమా మామూలుగా ఉండదు. ఇది నిజంగా జరుగుతుందో లేదో చూద్దాం.